సారథి న్యూస్, అనంతపురం: అనంతపురం నగరంలో ట్రాఫిక్ సీఐగా నిధులు నిర్వర్తిస్తున్న రాజశేఖర్ కరోనా బారినపడి మంగళవారం మృతిచెందారు. స్థానిక సవేరా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సీఐ మృతి పట్ల హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో ఉన్నప్పుడు తన సమకాలీకుడిగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాడని ఆయన కితాబిచ్చారు. సీఐ రాజశేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు.
- July 15, 2020
- Archive
- అనంతపురం
- ఆంధ్రప్రదేశ్
- షార్ట్ న్యూస్
- ANANTHAPURAM
- CAROONA
- TRAFFIC CI
- అనంతపురం
- కరోనా
- ట్రాఫిక్సీఐ
- Comments Off on కరోనాతో ట్రాఫిక్ సీఐ మృతి