Breaking News

అనుమానమే పెనుభూతమై..

సారథి న్యూస్​, చిత్తూరు : చిత్తూరు జిల్లా వి కోట మండలం పాముగానిపల్లిలో అనుమానం పెనుభూతమై పచ్చని కాపురంలో చిచ్చు రగిలింది. తాగుడుకు బానిసైన భర్త ప్రభాకర్​ రెడ్డి (32)  భార్య రేణుక (22)పై అనుమానం పెంచుకుని సోమవారం ఉదయం భార్యభర్తలిద్దరూ గొడవ పడ్డారు. పాముగానిపల్లె సమీపంలోని పొలం వద్ద ఇరువురు ఘర్షణ పడి కోపంతో వెంట తెచ్చుకున్న కత్తితో భార్య మెడపై నరికాడు. ఆమె స్పాట్​లోనే చనిపోయింది. అనంతరం అతను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వీరికి నాలుగేళ్ల కొడుకు, రెండేళ్ల కూతురు ఉన్నారు. ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కొన ఊపిరితో ఉన్న ప్రభాకరరెడ్డిని చికిత్స నిమిత్తం వికోట ఆస్పత్రికి ఎస్సై మహేష్ బాబు, సిబ్బంది తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.