షార్జా: ఐపీఎల్13వ సీజన్లో భాగంగా షార్జా వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన 52వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఇది సన్‌రైజర్స్‌కు ఆరో విజయం. పాయింట్ల పట్టికలో ఫోర్త్ ప్లేస్‌కు చేరింది. ముందుగా ఆర్సీబీ నిర్దేశించిన 121 పరుగుల టార్గెట్‌ను 14.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలవడంతో ప్లే ఆఫ్ ఆశలను ఇంకా సజీవంగా ఉన్నాయి. వృద్ధిమాన్ సాహా( 39; 32 బంతుల్లో 4×4, 6×1) రాణించడంతో పాటు మనీష్ పాండే(26; 19 బంతుల్లో 4×3, 6×1), హోల్డర్(26 నాటౌట్; 10 బంతుల్లో 4×1, 6×3) బ్యాట్ ఝళిపించడంతో హైదరాబాద్ఈజీగా విజయం సాధించింది. బెంగళూరు బౌలర్లలో చహల్ రెండు వికెట్లు తీశారు. వాషింగ్టన్ సుందర్, సైనీ, ఉదానాకు ఒక్కో వికెట్ చొప్పున పడ్డాయి.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 120 పరుగులకు మాత్రమే కుప్పకూలింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను జోష్ ఫిలెప్పి, దేవదూత్ పడిక్కల్ ప్రారంభించారు. పడిక్కల్(5), విరాట్ కోహ్లి(7), డివిలియర్స్(24), ఫిలెప్పి(32), వాషింగ్టన్ సుందర్(21), క్రిస్ మోరిస్(3), ఇసురు ఉదాన(0).. ఇలా ఎవకూ చెప్పుకోదగిన స్కోరు చేయలేదు. సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, హోల్డర్ రెండు వికెట్ల చొప్పున తీశారు. నటరాజన్, నదీమ్, రషీద్‌ఖాన్ ఒక్కో వికెట్చొప్పున తీశారు.
- October 31, 2020
- Archive
- Top News
- క్రీడలు
- HYDERABAD
- ROYAL CHALLENGERS
- SUNRISERS
- VIRATKOHLI
- రాయల్‌చాలెంజర్స్
- విరాట్‌కోహ్లీ
- సన్‌రైజర్స్
- హైదరాబాద్
- Comments Off on హైదరాబాద్.. ఫోర్త్ప్లేస్