న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్ (64) శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. మార్చ్ లో చికిత్స కోసం ఆయన సింగపూర్ ఆస్పత్రికి కూడా వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అమర్‌సింగ్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 1956 జనవరి 27 ఉత్తరప్రదేశ్‌లోని అజంఘర్‌లో అమర్‌సింగ్ జన్మించారు. 1996లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో చివరి సారిగా రాజ్యసభకు సమాజ్‌వాదీ పార్టీ నుంచి నామినేట్ అయ్యారు. గతంలో యూపీఏ ప్రభుత్వానికి సమాజ్ వాదీ పార్టీ మద్దతు ప్రకటించడంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత పార్టీతో విభేదాలు రావడంతో ఎస్పీ నుంచి ఆయన బయటకు వచ్చారు. అమర్‌సింగ్ మృతిపట్ల పలువురు రాజకీయ, సినీప్రముఖులు సంతాపం ప్రకటించారు.
- August 2, 2020
- Archive
- Top News
- జాతీయం
- AMARSINGH
- SAMAJWADIPARTY
- UTTARPRADESH
- అమర్‌సింగ్
- ఉత్తరప్రదేశ్
- సమాజ్‌వాదీ పార్టీ
- Comments Off on సీనియర్ నేత అమర్ సింగ్ ఇకలేరు