సారథిన్యూస్, హైదరాబాద్: సీఎం కేసీఆర్ హామీమేరకు సింగరేణికి చెందిన కార్మికులకు రూ.210 కోట్లు వెచ్చించి నూతన క్వార్టర్లు నిర్మించి ఇస్తామని సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్ బోర్డు డైరెక్టర్లు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. సింగరేణి విద్యాసంస్థలకు రూ. 45 కోట్లు కేటాయించేందుకు, సింగరేణిలో ప్రత్యేకపర్యావరణశాఖ ఏర్పాటు చేసేందుకు బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. సమావేశంలో బోర్డు సభ్యులు వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ సీఎండీ రాజీవ్ రంజన్ మిశ్రా, కేంద్ర బొగ్గు శాఖ డిప్యూటీ సెక్రటరీలు శ్రీ పీఎస్ఎల్ స్వామి, అజితేష్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు, సింగరేణి నుండి డైరెక్టర్ ఎస్శంకర్, డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్, బీ భాస్కరరావు, డైరెక్టర్, బలరాం, రవిశంకర్, గుండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- July 20, 2020
- Archive
- తెలంగాణ
- HYDERABAD
- KCR
- LABOUR
- SINGHARENI
- SRIDHAR
- సారథిన్యూస్
- సింగరేణి
- Comments Off on సింగరేణిలో క్వార్టర్ల నిర్మాణం