Breaking News

సంక్షేమ పథకాలు అందరికీ అందాలి

సంక్షేమ పథకాలు అందరికీ అందాలి

సారథి న్యూస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో తుంగతుర్తి నియోజకవర్గ నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులతో ఆదివారం సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ముఖ్య​అతిథులుగా విద్యుత్​శాఖ మంత్రి జి.జగదీశ్వర్​రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కోరారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికీ అందేలా చూడాలని కోరారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా రైతు కమిటీ అధ్యక్షుడు కోఆర్డినేటర్ ఎస్కే రజాక్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు గుజ్జ యుగంధర్ రావు, గుడిపాటి సైదులు, ఐతగోని వెంకన్న, పోన్నబోయిన రమేష్, మున్నా మల్లయ్య, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.