Breaking News

శ్రీశైలానికి సీఎం జగన్​

శ్రీశైలానికి సీఎం జగన్​

సారథి న్యూస్, కర్నూలు: ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ఇప్పటికే పదిగేట్లను ఎత్తివేసి నాగార్జునసాగర్​జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు భద్రత, నీటి మట్టం, విద్యుదుత్పత్తి.. తదితర వాటిని పరిశీలించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్​మోహన్​రెడ్డి ఆగస్టు 21న శుక్రవారం శ్రీశైలం రానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలిక్యాప్టర్​లో శ్రీశైలంలోని సున్నిపెంట హెలిప్యాడ్ లో దిగుతారు. అక్కడి నుంచి జెన్​కో గెస్ట్​హౌస్​కు వెళ్లి, అనంతరం శ్రీశైలం డ్యాం వద్దకు వెళ్లి పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు ఏరియల్ సర్వే ద్వారా కర్నూలు జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులను చూసుకుని విజయవాడకు తిరిగి వెళ్తారని కర్నూలు కలెక్టర్ జి.వీరపాండియన్ గురువారం విలేకరులకు తెలిపారు.