సారథి న్యూస్, కర్నూలు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలకు వరద నీరు పోటెత్తడంతో శ్రీశైలం 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బృందం శ్రీశైలం జలాశయం ప్రాజెక్టు ను సందర్శించి గేట్లను పరిశీలించి.. డ్యాంకు వస్తున్న వరద పరిస్థితి, ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్యాం ఎడమ గట్టున ఉన్న తెలంగాణ జెన్ కో పవర్ హౌస్ అగ్నిప్రమాదంపై ఆరాతీశారు. డ్యామ్‌ను పరిశీలించిన వారిలో నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిషోర్ రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, నందికొట్కూరు ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, శ్రీశైలం దేవస్థానం ఈవో కేఎస్ రామారావు, ఈఎన్సీ నారాయణరెడ్డి, జలందర్, సీఈ మురళీనాథ్ రెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాసులు ఉన్నారు. అంతకుముందు కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ రవిపట్టన్ షెట్టి, ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప తదితరులు ప్రాజెక్టును సందర్శించారు.
- August 22, 2020
- Top News
- కర్నూలు
- ANDRAPRADESH
- AP CM JAGAN
- POWERHOUSE
- SRISAILAM
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ సీఎం జగన్
- శ్రీశైలం
- Comments Off on శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి బృందం