Breaking News

శృంగార ఔషధంతో కరోనాకు చెక్​

వాషింగ్టన్​: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని ‘ఆర్​ఎల్​ఎఫ్-​​100’ అనే ఔషధం పనిచేస్తుందని అమెరికా వైద్యులు తేల్చారు. ఈ మందును రోగులపై వాడేందుకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ కూడా ఆమోదం తెలిపింది. అయితే ఈ మందు కొత్తగా వాడుకలోకి వచ్చిందేమి కాదు. శృంగార సమయంలో పరుషులకు ఉత్తేజాన్ని ఇచ్చేందుకు ఈ మందును వినియోగించేవారు. కానీ ప్రస్తుతం ఇది కరోనాను నియంత్రిస్తుండటం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మందును ‘అవిప్టడిల్’ అనే పేరుతో మార్కెట్లో అమ్ముతుంటారు. దీన్ని ముక్కుద్వారా పీల్చుకోవాలి. అయితే కరోనా రోగులకు ఈ మందును వాడటంతో అనూహ్యఫలితాలు వచ్చాయి. తొలుత ఈ మందును అమెరికా కు చెందిన ఒక 54 ఏళ్ల వ్యక్తి ఊపిరితిత్తుల మార్పడి శస్త్రచికిత్స ఫెయిల్ కావటంతో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు గురయ్యాడు. అదే సమయంలో అతడికి కరోనా సోకింది. ఈ క్రమంలో శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన్ను.. నాలుగు రోజుల పాటు వెంటిలేటర్ల మీదనే చికిత్స చేశారు. దాని మీద నుంచి బయటకు తెచ్చేందుకు ఆర్ఎల్ఎఫ్ – 100 ఔషధాన్ని వినిగించగా.. అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి.ఆ తర్వాతి కాలంలో ఇదే మందును పలువురికి వినియోగించి చూశారు. వీరంతా కోలుకున్నారు. ఈ మందుపై మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉన్నదని వైద్యనిపుణులు చెబుతున్నారు.