- ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
- అభివృద్ధికి అడ్డుగా మారిన వైరస్
- తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీకి చెక్
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు పెరగడంలో పలు జిల్లాలు పోటీపడుతున్నాయి. భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు కట్టుకోకపోవడంతో కేసులు పెరుగుతున్నాయి. మార్చి 25 నుంచి మే 30వ తేదీ వరకు లాక్ డౌన్ విధించినప్పుడు నియంత్రణలో ఉన్న కరోనా వైరస్ లాక్ ఓపెన్ చేసిన తర్వాత పంజా విసిరింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలకు, అభివృద్ధి పనులకు అడ్డంకిగా మారింది. దివంగత నేత వైఎస్సార్ జయంతి 8వ తేదీన పేదకు ఇళ్ల పట్టా పంపిణీకి సర్వం సిద్ధంచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వైరస్ వ్యాప్తి కట్టడి కాకపోవడంతో పట్టా పంపిణీ మరోసారి వాయిదా పడింది. వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. పోలీసులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా.. ఇలా ఎవరెన్ని చెప్పినా.. ప్రజ చెవికెక్కడంలేదు. రైతు బజార్లు, చేపు, మాంసం తదితర వస్తువు కొనుగోళ్ల సమయంలో సామాజిక దూరం పాటించాలన్న స్పృహ లేకుండా తోసుకెళ్తున్నారు. లాక్‌డౌన్ ఉన్న సమయంలో కంట్రోల్ అయిన వైరస్.. అన్ లాక్‌లో అతి తక్కువ రోజుల్లోనే ఎక్కువ కేసు పెరిగాయి. స్వీయనిర్బంధం పాటించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని వైద్యవర్గాలు చెబుతున్నాయి.
లోపాలెన్నో..!
రాష్ట్రంలో వైరస్ వ్యాప్తికి ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం చేసిన.. చేస్తున్న లోపాలెన్నో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి 60 ఏళ్లు పైబడిన వారి రక్తనమునాలు సేకరించి ముందు జాగ్రత్త చర్యగా పరీక్షలు చేస్తున్నారు. కొందరికి పాజిటివ్ వస్తుంది. మిగతా వారికి నెగిటివ్ వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చే వరకు వారం రోజుల గడువు పడుతోంది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని తీసుకెళ్తున్నారు.. మిగతా వారు హోం క్వారంటైన్‌లో ఉండాలి. కానీ వారెవరూ ఉండడం లేదు. ఒక ఇంట్లో ఒక వ్యక్తికి పాజిటివ్ కేసు వస్తే మిగిలిన వారికి టెస్టు చేస్తున్నారు. కానీ ల్యాబ్ ఫలితాలు ఆలస్యంగా రావడం, వారం రోజులైనా రాకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఇష్టానుసారంగా బయట తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది.
పేదల ఆశలపై నీళ్లు
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జులై 8వ తేదీన పేదలకు 30 లక్ష ఇళ్ల పట్టాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ వైరస్ వ్యాప్తి చెందడంతో రెండుసార్లు వాయిదాపడింది. దీంతో పేద ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. రాష్ట్ర అభివృద్ధికి కరోనా వైరస్ అడ్డుపడుతోందని రాజకీయ నాయకులు అంటున్నారు.
జిల్లాల వారీగా పాజిటివ్ కేసులు నమోదు
అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు 2,328 కేసులు నమోదుకాగా, అందులో 956 యాక్టివ్, 1,359 మంది డిశ్చార్జ్, 13 మంది మరణించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో 1,444 కాగా యాక్టివ్ కేసు 857, డిశ్చార్జ్ 574, 13 మంది మృతి చెందారు. ఈస్ట్ గోదావరిలో 1,778 కేసులు కాగా, 1,299 యాక్టివ్, 471 డిశ్చార్జ్ అయ్యారు. 8 మంది మృతిచెందారు. గుంటూరులో 2,024 కేసులు కాగా, 1,229 యాక్టివ్, 471 డిశ్చార్జ్, 8 మంది మృతిచెందారు. కడప జిల్లాలో 1,341, యాక్టివ్ కేసులు 882, డిశ్చార్జ్ 455 మంది అయ్యారు. నలుగురు మృతిచెందారు. కృష్ణాలో 1,798 కాగా 1,056 యాక్టివ్ కేసులు, 672మంది డిశ్చార్జ్ అయ్యారు. 70 మంది మృతిచెందారు. కర్నూలులో 2,587 నమోదు కాగా, 1239 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1267 డిశ్చార్జ్, 81 మంది మృతిచెందారు. నెల్లూరులో 771 కేసులు కాగా, యాక్టివ్ 383, డిశ్చార్జ్ 382, ఆరుగురి మృతి, ప్రకాశంలో 738 నమోదు కాగా, 321 యాక్టివ్ కేసులు, 415 డిశ్చార్జ్, ఇద్దరు మృతిచెందారు. శ్రీకాకుళంలో 225 నమోదుకాగా, 163 యాక్టివ్ కేసులు, 54 డిశ్చార్జ్, 8 మంది మృతిచెందారు. విశాఖపట్నం జిల్లాలో 822 కాగా 399 యాక్టివ్, 416 డిశ్చార్జ్, ఏడుగురు మృతిచెందారు. విజయనగరం 239 కాగా 173 యాక్టివ్, 63 డిశ్చార్జ్, ముగురు మృతి చెందారు. వెస్ట్ గోదావరి జిల్లాలో 1,270 నమోదు కాగా 917 యాక్టివ్, 349 డిశ్చార్జ్, నలుగురు మృతి చెందారు. ఇతర రాష్ట్రా నుంచి వచ్చిన వారికి 2,235, 802 యాక్టివ్, 1,433 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇతర దేశాల నుంచి 419 కేసు నమోదు కాగా, 184 యాక్టివ్, 235 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీ రాష్ట్రంలో మొత్తం 20,019 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.