సారథి న్యూస్, కడప: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి రెడ్డి, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ‘నాలో.. నాతో వైఎస్సార్’ పుస్తకాన్ని సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయలో ఆవిష్కరించారు.
- July 8, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- EDUPULAPAYA
- KADAPA
- YS JAGAN
- YSR
- వైఎస్ జగన్
- వైఎస్సార్
- వైఎస్సార్సీపీ
- Comments Off on వైఎస్సార్‌కు ఘన నివాళి