![విల్లు ఎక్కుపెట్టిన పౌరుషం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/nagas-2f.jpg?fit=650%2C459&ssl=1)
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. కేతికశర్మ హీరోయిన్. నారాయణదాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు, శరత్ మరార్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగశౌర్య కెరీర్లో ఇది 20వ సినిమా. అయితే నిర్మాతల్లో ఒకరైన నారాయణదాస్ కె.నారంగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ లుక్‌ను ఆవిష్కరించారు. ‘అశ్వత్థామ’ సినిమాతో మాస్ ఇమేజ్‌కు మారిన నాగశౌర్య ఈ చిత్రంలో మరింత మాసివ్‌గా కనిపిస్తున్నాడన్నారు. ప్రాచీన విద్య అయిన విలు విద్య బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా ఉంటుందని ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. దానికి తగినట్టే కండలు తిరిగిన దేహం, గుబురుగా పెరిగిన గెడ్డం, ముడివేసుకున్నా జుట్టు, శరీరంపై గాయాలతో బాణాన్ని ఎక్కుపెడుతూ తీక్షణమైన చూపుతో అభినవ ఏకలవ్యుడిగా దర్శనమిచ్చాడు నాగశౌర్య. అయితే ఈ ఏకలవ్యుడి లక్ష్యం ఏమిటన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు మేకర్స్. కాగా ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.