మరాఠీలో సక్సెస్ అయిన సినిమాను కృష్ణవంశీ ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ఓ కీలకపాత్ర పోషిస్తోంది. ‘రంగస్థలం’ సినిమాతో రంగమ్మత్తగా స్థిరపడిన అనసూయ ఈ మూవీలో విలన్‌గా కనిపించనుందట. అయితే గతంలో ఒక సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర ఒకటి చేసింది అనసూయ. ఆ సినిమాలో కొద్దిసేపే కనిపిస్తుందట. ఈ సినిమాలో అయితే ఫుల్ లెంగ్త్ నెగెటివ్ రోల్ చేస్తుందట. ఏ పాత్రలోనైనా తన నటనానైపుణ్యంతో అదరగొట్టే అనసూయ ఈ చిత్రంలో జీవితాంతం అవివాహితగానే ఉండే స్త్రీ పాత్రలో నటిస్తుందట. ఆమె క్యారెక్టర్ అప్పటి దేవదాసి పాత్రను పోలి ఉంటుందని తెలుస్తోంది. అయితే కొంతకాలంగా కృష్ణవంశీ ఫ్లాప్ లే ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ చిత్రంపై ఎక్కువ శ్రద్ధ పెట్టి తెరకెక్కిస్తున్నాడు. ఇది కనుక హిట్ కొడితే అనసూయ లక్ బూరెల గంపలో పడినట్టే. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో జీవిత రాజశేఖర్ చిన్నకూతురు శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు.
- July 22, 2020
- Archive
- Top News
- సినిమా
- ANASUYA
- KRISHNAVAMSHI
- VILLAIN ROLE
- అనసూయ
- కృష్ణవంశీ
- ప్రకాశ్‌రాజ్
- రంగస్థలం
- Comments Off on విలన్ రోల్లో అనసూయ