- సర్కారు స్కూళ్లలో సెప్టెంబర్ 1 నుంచి క్లాసెస్
- కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: మానవాళిని కరోనా వణికిస్తున్న వేళ.. విద్యార్థులు విద్యాసంవత్సరం కోల్పోకుండా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. టీశాట్, దూరదర్శన్ ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పనున్నారు. ఇప్పటికే ఆయా చానళ్లతో ఒప్పందం కుదిరింది. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా ఈనెల 27 నుంచి విధులకు హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అయితే కరోనా కారణంగా లాక్‌డౌన్ తర్వాత ప్రభుత్వ స్కూళ్లు ఇప్పటివరకు తెరుచుకోలేదు. ప్రైవేట్స్కూళ్లు మాత్రం ఆన్‌లైన్ లో పాఠాలు చెప్పిస్తున్నాయి. అయితే మరికొన్ని రోజుల వరకు స్కూళ్లు తెరిచే అవకాశం లేకపోవడంతో ఆన్లైన్పాఠాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.