న్యూఢిల్లీ: నాకౌట్ మ్యాచ్‌ల్లో ఎదురయ్యే ఒత్తిడిని టీమిండియా క్రికెటర్లు తట్టుకోలేరని మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. మెగా ఈవెంట్లలో సెమీస్, ఫైనల్ మ్యాచ్‌ల్లో కోహ్లీసేన ఆటతీరు చూస్తే ఇది అర్థమవుతుందన్నాడు. ఈ విషయంలో మెరుగుపడనంత వరకు ప్రపంచ చాంపియన్లు కాలేరన్నాడు. ‘నాకౌట్ మ్యాచ్‌ల్లో మన ఆట బాగాలేదు. గత కొన్ని టోర్నీల్లో దీనిని చూశాం. ఈ మ్యాచ్‌ల్లో మనం ఎలా ఆడతామనే దానిని బట్టే మంచి, అద్భుతమైన ప్లేయరా అనేది తెలుస్తుంది. ఇతర జట్లలాగా మనం ఒత్తిడిని అధిగమించలేకపోతున్నాం. లీగ్ స్టేజ్‌లో బాగా ఆడతాం. నాకౌట్ వచ్చేసరికి చతికిలపడతాం. చాలా రోజుల నుంచి ఇది కొనసాగుతుంది కాబట్టి ఇప్పట్లో మనం ప్రపంచ చాంపియన్లం కాలేం’ అని గౌతీ వివరించాడు. 2013లో చాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత.. జరిగిన ఐదు ఐసీసీ టోర్నీల్లో టీమిండియా నాకౌట్ స్టేజ్‌ను దాటలేకపోయింది.
- June 14, 2020
- Archive
- Top News
- క్రీడలు
- షార్ట్ న్యూస్
- GAMBHIR
- TEAMINDIA
- గంభీర్
- నాకౌట్
- Comments Off on వాళ్లకు నాకౌట్ భయం