భారత్, చైనా సైనికుల ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ పార్థివదేహాన్ని లేహ్ నుంచి ప్రత్యేక విమానంలో తరలించారు. ఆయన మృతదేహం హకీంపేటకు చేరుకోనున్నది. సంతోష్‌బాబు కుటుంబ సభ్యులు కూడా ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. గురువారం అంత్యక్రియలు జరగనున్నాయి. హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు జరపాలని ఆర్మీ అధికారులు పట్టుపడుతున్నారు. కరోనా కారణంగా సంతోష్‌బాబు మృతదేహాన్ని సూర్యాపేటకు తరలించడం సాధ్యంకాదని అధికారులు చెబుతున్నారు. కుటుంబసభ్యులు ఇష్టప్రకారమే అంత్యక్రియలు చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సంతోష్‌బాబు కుటుంబసభ్యులు మాత్రం అంత్యక్రియలు సూర్యాపేటలోనే చేయాలని కోరుతున్నట్లు సమాచారం.
- June 17, 2020
- Archive
- తెలంగాణ
- HYDERABAD
- INDIANAIRLINES
- SANTOSHBABU
- SURYAPET
- అంత్యక్రియలు
- కిషన్ రెడ్డి
- Comments Off on రేపు కల్నల్ సంతోష్ అంత్యక్రియలు