సుశాంత్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిపై బాంబే హైకోర్టు సానుభూతి కనబర్చింది. ‘రియా కేసు విషయంలో మీడియా ఎందుకంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నది. నిరంతరం బ్రేకింగ్ న్యూస్‌లతో ఆమెను ఎందుకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. రియా ఇంటి ఎదుటే మీడియా టెంట్ వేసుకొని కూర్చొంది. ఆమె కాలి బయట పెడితే .. చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మీడియా ప్రతినిధులు. రియా విషయంలో మీడియా చాలా అతిచేస్తుంది. నిందితురాలికి కొన్ని హక్కులుంటాయి. నేరం విచారణ జరగముందే ఆమెను దోషిగా నిలబెట్టడం తప్పు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు. కేంద్రం ఈ అంశంపై లిఖితపూర్వక సమాధానం చెప్పాలి’ అంటూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంపై కేంద్రప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.