- చర్లగూడం ప్రాజెక్టు కారణంగా 50 మంది రైతులు మృత్యువాత
- ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులు నేడు అడ్డాకూలీలు
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్‌ప్రవీణ్‌కుమార్ ధ్వజం
- మర్రిగూడం భూనిర్వాసిత రైతుల ధర్నాకు మద్దతు
సామాజికసారథి, మునుగోడు: చర్లగూడెం భూనిర్వాసితులకు సీఎం కేసీఆర్ ఫాంహౌస్ అమ్మి అయిన సరే భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని బీఎస్పీ రాష్ర్ట అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల్లో పరిహారం కోసం స్థానికుల నాయకులను ఆశ్రయిస్తే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పెన్నులో ఇంకు అయిపోయిందని టీఆర్‌ఎస్‌నాయకులు, తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని ఆశ్రయిస్తే చెప్పుతో కొడతానని రైతులను అమర్యాదగా మాట్లాడారని గుర్తుచేశారు. రాజగోపాల్‌రెడ్డి ది రెండు నాల్కల ధోరణి అని ఓట్ల సమయంలో ప్రజల సమస్యల కోసం తాను ప్రాణాత్యాగానికైనా సిద్ధమని ప్రకటించిన రాజ్‌గోపాల్‌రెడ్డి బాధితుల పక్షాన ఎందుకు పోరాడకుండా మౌనం వహించడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. చర్ల ప్రాజెక్టులో ఆయనకు కుడా వాటా ఉంది కాబట్టే ప్రాజెక్టు పేరు ఊసేత్తడం లేదన్నారు.
శనివారం మర్రిగూడెం మండలంలో 128 రోజు బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్మాట్లాడుతూ ప్రాజెక్టుల పేరు చేప్పి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకున్నదని, ఎకరాకు కేవలం రూ.4.5 లక్షలు పరిహారం చెల్లించందని, ఆ డబ్బుతో పల్లెల్లో ఇంటిజాగా కూడా వస్తలేదన్నారు. ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన చిన్నసన్నకారుల రైతులు ఉపాధి కోల్పోయి తమ బిడ్డల పెళ్లీలు చేయలేని దీనస్థితిలో ఉన్నారని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం పరిహారం ఇవ్వడంలో మోసం చేయడంతో ఇప్పటి వరకు 50మంది వరకు మృత్యువాతపడటం కలిచివేసిందని చెప్పారు.
మీ వెంట నేనుంటా..
బీఎస్పీకి ప్రజలు, రైతులు మద్దతూ తెలిపితే ప్రజాసమస్యలను పరిష్కరిస్తానని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హామీ ఇచ్చారు. బహుజనులంతా ఏనుగు గుర్తును గుండెల్లో పెట్టుకోవాలని ఆయన కోరారు. కేంద్రంలో అధికారపార్టీ దేశాన్ని దోసి కార్పొరేట్లకు జేబులు నింపుతుంటే తెలంగాణ రాష్ర్టంలో కుటుంబపాలన అవినీతి మయం చేసి రాష్ర్టాన్ని అథోగతి పాలు చేశారని ఆయన విమర్శించారు. ఆధిపత్య కులాలకు చెందిన పార్టీలంతా ఓకే తాను ముక్కలని రంగులు వేరైనా వారంతా ఊసురవెళ్లలేనని, వచ్చే ఎన్నికలో వారికి కర్రు కాల్చి వాతపెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను పట్టించుకోని పార్టీలు ఓట్ల కోసం మన వద్దకు వస్తే వారిని తరిమికొట్టాలన్నారు. యాత్రలో భాగంగా రాంరెడ్డిపల్లి, మర్రిగూడం, చర్లగూడం, తండారుపల్లి, లెంకలపల్లి, భీమనపల్లి, కమ్మగూడెం, వట్టిపల్లి, యర్రగండ్లపల్లిలో ఆయన పర్యటించారు. పర్యటన ఎంతో ఉత్సాహంగా సాగింది. ఆయా గ్రామాల్లో ప్రజలందరితో ఆర్ఎస్పీ కలిసిపోతూ వారి సమస్యలను ఓపికగా వింటున్నారు. బహుజన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మహిళలు, కార్యకర్తలు, అభిమానాలు సంప్రదాయ డప్పులు కోలాటలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో బీఎస్పీ అధ్యక్షుడు పూదరి సైదులు, జిల్లా నాయకులు పల్లెటి రవీందర్, మహిళా కన్వీనర్లు కత్తుల పద్మాయాదవ్, పోకల ఎలిజబెత్, నాయకులు కాన్షీరాం, శ్రీనివాస్ పాల్గొన్నారు.