అసిఫాబాద్: ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లా కదంబా అటవీప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఈనెల 19న ఇద్దరు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు మరింత నిఘాపెంచారు. మావోయిస్టు రాష్ర్ట కమిటీ సభ్యుడు అడెల్లు అలియాస్ భాస్కర్ లక్ష్యంగా కూంబింగ్ చేపడుతున్నారు. అడవుల్లో తప్పించుకున్న మావోయిస్టుల ఆచూకీని తెలుసుకునేందుకు డ్రోన్ కెమెరాల సాయంతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాలు, దట్టమైన అడవులను డ్రోన్ల సహాయంతో గ్రేహౌండ్స్ బలగాలు, పోలీసులు జల్లెడ పడుతున్నారు. పెంచకల్‌పేట మండలం సిద్ధేశ్వరగుట్ట, లోడేపల్లి, చింతమనేపల్లి గూడెం, ప్రాణహిత నది సరిహద్దు పరీవాహక ప్రాంతాల్లో పోలీసులను పెద్దసంఖ్యలో మోహరించారు.
- September 22, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- DRONE
- KADAMBA ENCOUNTER
- MAOIST
- కదంబా అటవీప్రాంతం
- కూంబింగ్
- డ్రోన్
- మావోయిస్టు
- Comments Off on మావోయిస్టుల కదలికలపై డ్రోన్ నిఘా