Breaking News

‘మర్డర్’ కుటుంబ కథాచిత్రమ్

‘మర్డర్’ కుటుంబ కథాచిత్రమ్

రీసెంట్​గా ‘పవర్ స్టార్’ సినిమాను ఆర్జీవి వరల్డ్​లో విడుదల చేసిన ఆర్జీవి ఇప్పుడు ‘మర్డర్’ కుటుంబకథా చిత్రమ్ ట్రైలర్​ను విడుదల చేశాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తీసే వర్మ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య నేపథ్యంలో ‘మర్డర్’ సినిమాను ‘కుటుంబ కథా చిత్రమ్’ అనే ట్యాగ్ లైన్​తో తీస్తున్న విషయం తెలిసిందే. అగ్రకులానికి చెందిన ఓ యువతి కులాంతర వివాహం చేసుకున్న తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను వర్మ ఈ చిత్రంలో స్పష్టంగా చూపిస్తున్నట్టు ఈ ట్రైలర్​తో అర్థమవుతోంది. కూతురుపై విపరీతమైన ప్రేమ పెంచుకున్న ఓ తండ్రి.. తన కూతురు ఓ యువకుడితో ప్రేమలో పడి అతడినే పెళ్లిచేసుకుని, తండ్రికి ప్రతిగా తయారవుతుంది.

తన కూతురు తీరు తట్టుకోలేక అల్లుడుని చంపించేశాడు ఆ యువతి తండ్రి. ప్రేమ.. పరువు గురించి ఆలోచిస్తూ వాటి మధ్య నలిగిపోయిన తండ్రి మానసిక ఆవేదనే ఈ సినిమా రూపకల్పన. ట్రైలర్ ను చూస్తుంటే మళ్లీ ఇన్నాళ్లకు వర్మ తనదైన మార్క్​తో సినిమా తీశాడా..? అనిపించింది. కాగా, ఈ చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టీస్ ఎంటర్​టైన్​మెంట్స్​, క్విటీ ఎంటర్​టైన్​మెంట్స్​ కలిసి ఈ సినిమాను నిర్మించారు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి, భార్గవి ప్రధాన పాత్రలు పోషించారు. త్వరలో ఈ చిత్రం ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో విడుదల కానుంది.