సారథి న్యూస్, శ్రీకాకుళం(సీతంపేట): సీతంపేట ఐటీడీఏలో ఏర్పాటుచేసిన అటవీహక్కు(ఆర్వోఎఫ్ఆర్ పట్టాల) పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. ఆయన పాలకొండ ఎమ్మెల్యే కళావతి, ఐటీడీఏ పీవో శ్రీధర్ ఘనస్వాగతం పలికారు. గాంధీ జయంతి సందర్భంగా తొలుత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలో జీసీసీ ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్ జే.నివాస్, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, రెడ్డి శాంతి, డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్, ఐటీడీఏ పీవో శ్రీధర్, డీఎఫ్ వో సందీప్ కృపాకర్ పాల్గొన్నారు.
- October 2, 2020
- Archive
- లోకల్ న్యూస్
- శ్రీకాకుళం
- షార్ట్ న్యూస్
- DHARMANA KRISHNADAS
- RFR CERTIFICATES
- SITHAMPET
- SRIKAKULAM
- ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు
- ఏపీ
- ధర్మాన
- శ్రీకాకుళం
- సీతంపేట
- Comments Off on మంత్రికి ఘనస్వాగతం