![బావిలో పడి ఇద్దరు దుర్మరణం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/crimeeeeeffff.jpg?fit=700%2C360&ssl=1)
సారథి న్యూస్, ఖమ్మం: బావిలో పడి ఇద్దరు మహిళలు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం కొణిజర్లకు చెందిన ఐదుగురు వ్యవసాయ కూలీలు ఓ పొలంలో పనిచేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వారు జారి బావిలో పడ్డారు. స్థానికులు గమనించి ముగ్గురిని కాపాడగా, మరో ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.