ఇండస్ట్రీకి వచ్చి పన్నెండేండ్లయినా కాజల్ అగర్వాల్ స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. మూడు పదుల వయసులో కుర్ర హీరోయిన్స్‌కు గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ భామ ఓ భారీ చాన్స్ కొట్టేసిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘క్వాంటికో’ వెబ్ సిరీస్ ఇండియన్ రీమేక్ లో కాజల్ అగర్వాల్ నటించబోతోందట. ఈ వెబ్ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ వారు తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. పాన్ఇండియాలో ఫేమస్ అవ్వొచ్చనే ఆలోచనతో కాజల్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందట. వీటితోపాటు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తోన్న ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సిరీస్ లోనూ కాజల్ అగర్వాల్ కనిపించనుందని సమాచారం.
- July 22, 2020
- Archive
- సినిమా
- BOLLYWOOD
- KAJAL
- PRIYANKA
- REMAKE
- TOLLYWOOD
- కాజల్ అగర్వాల్
- ప్రియాంక చోప్రా
- Comments Off on ప్రియాంక ప్లేస్‌లో కాజల్