సారథిన్యూస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలికి అమరజవాన్ కల్నల్ సంతోష్‌బాబు పేరు పెడతామని రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట సమీపంలోని కేసారంలో నిర్వహించిన కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగదీశ్‌రెడ్డి ప్రతినిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసారం గ్రామాన్ని కల్నల్ సంతోష్‌బాబు జ్ఞాపక చిహ్నంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం తరఫున అన్నివిధాలా సాయం చేస్తామని చెప్పారు. చైనా సైన్యాన్ని తరిమికొట్టడంతో కల్నల్ సంతోష్ బాబు ఎంతో తెగువ ప్రదర్శించారని కొనియాడారు.
- June 18, 2020
- Archive
- తెలంగాణ
- JAGADEESH REDDY
- SANTOSHBABU
- SURYAPET
- TELANGANA
- అంత్యక్రియలు
- ప్రధాన కూడలి
- Comments Off on ప్రధానకూడలికి సంతోష్ బాబు పేరు