సారథి న్యూస్, హైదరాబాద్: ప్రజలకు పోలీసే మంచి స్నేహితుడని తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్విట్టర్ ద్వారా ఫ్రెండ్స్షిప్ డే ప్రాముఖ్యతను చెప్పారు. ‘ప్రజల ప్రతి అవసరంలోనూ స్పందించే వాడు, ప్రజలకు భద్రత, రక్షణ కల్పించేవాడు, అనునిత్యం ప్రజల క్షేమం గురించి ఆలోచించేవాడు పోలీసును మించిన మరో స్నేహితుడు లేడు. చట్టానికి, సమాజానికి కట్టుబడి ఉండే ప్రతి ఒక్కరికీ పోలీసుల కంటే మంచి స్నేహితుడు ఉండబోరు..’ అని అన్నారు. ప్రతి పౌరుడు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని, వారి నుంచి స్నేహ హస్తాన్ని అందుకోవాలని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి కోరారు.
- August 2, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ముఖ్యమైన వార్తలు
- DGP MAHENDARREDDY
- FRIENDSHIPDAY
- TELANAGANA
- డీజీపీ
- తెలంగాణ
- మహేందర్రెడ్డి
- Comments Off on ప్రజలకు పోలీసే మంచి స్నేహితుడు