సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగుళాంబ అమ్మవారి సన్నిధిలోని పుష్కర ఘాట్ కు భక్త జనసందోహం రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం రోజు ఐదో రోజుకు పుష్కరాలు చేరాయి. తెల్లవారుజామున 5గంటల నుంచే భక్తులు తుంగభద్ర నదిలో పుష్కర స్నానాలు ఆచరించి జోగుళాంబ అమ్మవారిని, బాలబ్రహ్మేశ్వరుణుడిని దర్శించుకున్నారు. సుమారు 15వేల మంది భక్తులు నదీ స్నానాలు ఆచరించి ఉంటారని అధికారులు అంచనా వేశారు. మాననపాడు మండలం పుల్లూరు గ్రామశివారులోని తుంగభద్ర నది తీరాన ఏర్పాటుచేసిన పుష్కర ఘాట్ లో మంగళవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై పుష్కర స్నానాలు చేశారు.
- November 25, 2020
- Archive
- Top News
- GADWALA
- JOGULAMBA
- MANAVAPADU
- TELANGANA
- TUNGABADRA PUSHKARALU
- అలంపూర్
- జోగుళాంబ గద్వాల
- తుంగభద్ర పుష్కరాలు
- తెలంగాణ
- మానవపాడు
- Comments Off on పుష్కరుడి చెంతకు భక్తజనం