సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజవర్గం పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ వద్ద జరుగుతున్న పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను శుక్రవారం మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, ఎస్.నిరంజన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ పి.రాములు, మహబూబ్నగర్ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి తదితరుల బృందం పరిశీలించింది. పనులను వేగవంతంగా పూర్తిచేయాలని, నాణ్యతగా ఉండాలని సూచించింది. బృందంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కలెక్టర్ఎల్.శర్మన్ ఉన్నారు.
- July 31, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ELLURE
- KRISHNA RIVER
- MAHABUBNAGAR
- PALAMUR
- కృష్ణానది
- పాలమూరు
- మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్
- మహబూబ్‌నగర్
- Comments Off on ‘పాలమూరు’ పనుల పరిశీలన