లక్నో: ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించినప్పటికీ స్త్రీలు, చిన్నారులపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లకీంపూర్లో మూడేండ్ల చిన్నారిపై దుండగులు లైంగికదాడి జరిపి.. ఆపై చిన్నారిని చంపేశారు. బుధవారం చిన్నారి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదుచేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు గ్రామానికి 200 మీటర్ల దూరం మృతదేహం దొరికింది. పోస్ట్‌మార్టం నిర్వహించగా లైంగికదాడి జరిగినట్టు తేలింది. ఈ సందర్భంగా చిన్నారి తండ్రి మాట్లాడుతూ.. తనపై పగతోనే దుర్మార్గులు ఈ ఘాతుకానికి పాల్పడ్డాని పేర్కొన్నారు. వరుసగా మహిళలపై అత్యాచారాలు జరుగుతుండటంతో ప్రతిపక్షాలు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు యోగీ ఆదిత్య సర్కార్‌పై మండిపడుతున్నాయి.
- September 4, 2020
- Archive
- క్రైమ్
- జాతీయం
- CHENNAI
- GIRL
- GOVERNMENT
- POLICE
- RAPE
- UTTARPRADESH
- అఘాయిత్యం
- ఉత్తర్‌ప్రదేశ్
- పోలీస్
- బాలిక
- లైంగికదాడి
- హత్య
- Comments Off on పసిమొగ్గను చిదిమేశారు