Breaking News

పల్లె పల్లెనా.. కల్లాలు

తెలంగాణ మంత్రులు

సారథిన్యూస్​, హైదరాబాద్: పంటలు ఆరబోసుకోవడానికి కల్లాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే కల్లాలు నిర్మించాలని యోచిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి వర్గ ఉపసంఘం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మినిస్టర్ క్వార్టర్స్ లోని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో మంత్రులు హరీష్ రావు. జగదీశ్​రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశమై పలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉపాధి హామీ పథకం కింద హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో దాదాపు లక్ష కల్లాలు నిర్మించేందుకు మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఒక్కో కల్లం నిర్మాణానికి రూ 46,045 అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రతిపాదనలను ఉపసంఘం సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్లింది. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్​రెడ్డి, వివిధ శాఖల కార్యదర్శులు అధికారులు పాల్గొన్నారు.