వెర్సటైల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బయోపిక్ ‘పరాన్న జీవి’ నూతన్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది కలిసి ఈ సినిమాకి ఫండింగ్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆర్జీవీని టార్గెట్ చేస్తూ ‘పరాన్నజీవి’ సినిమా నుంచి ‘పరాన్నజీవి..జీవి నిర్జీవి ఆర్జీవీ..’ అంటూ సాగే ఓ పాటను రిలీజ్ చేశారు.కాగా,ఈ రోజు ‘పరాన్నజీవి’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. రామ్ గోపాల్ వర్మను ఇమిటేట్ చేసే జబర్ధస్త్ కమెడియన్ షకలక శంకర్ ని ఈ సినిమాలో ఆర్జీవీగా చూపించబోతున్నారు. అంతేకాకుండాఆర్జీవీ ని టార్గెట్ చేస్తున్నట్లు డైరెక్ట్ గా చెప్పకుండా ‘పరాన్న జీవి’ టైటిల్ పోస్టర్ లో ఆర్జీవి ఇంగ్లిష్ లెటర్స్ హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు. అంతేకాకుండా రెక్లెస్ జెనెటిక్ వైరస్ అన్న ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేశారు.
కాగా ‘పరాన్నజీవి’ సినిమానుజూలై 25న ఉదయం 11 గంటలకు శ్రేయాస్ ఈటీ ఏటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. రాజకీయ నాయకులను మించిపోయి అటు ఆర్జీవీ. ఇటు పరాన్నజీవి వర్గం వారు ఒకరి పై ఒకరు సెటైరికల్ గా తీస్తున్న ‘పవర్ స్టార్’ ‘పరాన్నజీవి’ సినిమాల గురించే అభిమానులంతా చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలు రెండూ ఇంకెన్ని వివాదాలకు దారి తీస్తాయో వేచి చూడాల్సిందే అంటున్నారు ఫిల్మ్ నగర్ వాసులు.