సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగర పాలకసంస్థ పరిధిలో కొనసాగుతున్న ఇంజినీరింగ్ సంబంధిత అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కమిషనర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్ల పేర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని సూచించారు. అనుమతి పొందిన నిర్మాణ పనుల కోసం సిద్ధంచేసిన ప్రతిపాదనలను అనుసరించి పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఈనెల 20న జరిగే సచివాలయ ఉద్యోగ పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఎస్ఈ సురేంద్రబాబు, ఎంఈ 2 రమణమూర్తి, సూపరింటెండెంట్ ప్రసాద్ గౌడ్, డీఈలు రాజశేఖర్, షాకీర్, రవిప్రకాష్ నాయుడు, రసూల్, వెంకట సుబ్బయ్య, హార్టికల్చర్ ఏడీ సుజాత, ఏఈలు దినేష్, రాచయ్య, హిమబిందు, కృష్ణలత ఉన్నారు.
- September 10, 2020
- Archive
- Top News
- కర్నూలు
- లోకల్ న్యూస్
- CARPORATION
- COMMISSIONER
- Kurnool
- కమిషనర్
- కర్నూలు
- కార్పొరేషన్
- Comments Off on పనులు చేయకపోతే.. బ్లాక్‌లిస్టులో పెట్టండి