Breaking News

నక్సలైట్ల గురించి నేర్చుకున్నా..


నక్సలిజం నేపథ్యంలో ఎన్ని సినిమాలు వస్తున్నా వాటి ప్రభావం మాత్రం తగ్గడంలో లేదు. అంతేకాదు వాటిలో జాతీయ అవార్డులు అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు నరేష్, శర్వానంద్ నటించిన ‘గమ్యం’, నారా రోహిత్ నటించిన ‘ఒక్కడున్నాడు’ సినిమాలు నక్సలిజం నేపథ్యంలోనివే. ఆ రెండింటికి అవార్డులు వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో నక్సలిజం నేపథ్యంలో వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, జాతీయ ఉత్తమ నటి ప్రియమణి నక్సలైట్ పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ప్రియమణి బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. కామ్రేడ్ భారతక్క పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు. ఈ పాత్రను ప్రియమణి ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుందట. నక్సలైట్ల జీవన విధానాలను తెలుసుకునేందుకు ఒక మాజీ నక్సలైట్ వద్ద ప్రియమణి శిక్షణ కూడా తీసుకున్నదట. ఈ చిత్రంలో ప్రియమణి ఎంతో జోవియల్ గా ఉంటూ తోటి నక్సలైట్లలో ఉద్యమస్ఫూర్తిని రగిలిస్తూ ఉండే మహిళా నక్సలైట్ గా ప్రియమణి క్యారెక్టర్ ఉండనుందట.

తెలంగాణ ప్రాంతంలోని 1990 నాటి సామాజిక రాజకీయ పరిస్థితుల ఆధారంగా పీరియాడిక్ సోషల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రానా పాత్రలో రకరకాల వేరియేషన్స్ ఆకట్టుకోనున్నాయి. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానున్న ఈ సినిమాలో ద్వితీయార్థంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎంతో హైలెట్​గా ఉండనున్నాయట