సారథి న్యూస్, హైదరాబాద్: మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు తెలంగాణ భవన్లో గురువారం చిట్ చాట్ చేశారు. ఆర్ బీఐ తాజా నివేదిక ప్రకారం వ్యవసాయ రుణాలు అత్యధికంగా మాఫీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. మా డబ్బా మేం కొట్టుకోవడం కాదు. ఇది ఆర్బీఐ నివేదిక చెబుతుందన్నారు. మొత్తం రూ.27,718 కోట్లు రుణమాఫీకి నిధులు వెచ్చించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతుబంధుకు మరో రూ.28వేల కోట్లు జమచేశామన్నారు. రైతుబీమా, ఇన్పుట్ సబ్సిడీకి ఇంకా అదనంగా నిధులు వెచ్చించామని అన్నారు. రాష్ట్రంలో షీ టీమ్స్ పనితీరు అద్భుతంగా ఉందన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ గతం లో కన్నా ఎక్కువ మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యం లేదన్నారు. బీజేపీ తీరు సమాజంలో తక్కువ, సామాజిక మాద్యమంలో ఎక్కువగా అన్నట్టు ఉందన్నారు. వాట్సాప్ యూనివర్సిటీ నడుపుతూ తప్పుడు సందేశాలు పంపుతున్నారని విమర్శించారు. దుబ్బాక చైతన్యవంతమైన గడ్డ అని, రామలింగారెడ్డి విప్లవం తెచ్చారని గుర్తుచేశారు. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పు వస్తుందన్నారు. దుబ్బాక లో తమకు ప్రత్యర్థులు ఎవరూ లేరని అన్నారు. కరోనా కట్టడిలో తెలంగాణ విఫలమైందని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఘోరంగా దెబ్బతీసిందన్నారు.
- October 29, 2020
- Archive
- Top News
- పొలిటికల్
- BANDI SANJAY
- BJP
- DUBBAKA
- MINISTER KTR
- TELANGANA
- తెలంగాణ
- దుబ్బాక
- బండి సంజయ్
- బీజేపీ
- మంత్రి కేటీఆర్
- Comments Off on దుబ్బాకలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పు