సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది. అడిషనల్ సీఈవోగా జ్యోతి బుద్ధప్రకాష్, వైద్యారోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సయ్యద్ అలీ ముర్తుజారజీ, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి, ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ గా అదర్ సిన్హా, నాగర్‌కర్నూల్ కలెక్టర్‌గా ఎల్.శర్మన్, పాఠశాల విద్యాడైరెక్టర్‌గా శ్రీదేవసేన, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ గా వాకాటి కరుణ, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా కేఎస్ శ్రీనివాసరాజును నియమించింది. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా విజయ్‌కుమార్, సాంఘిక సంక్షేమశాఖ కమిషనర్‌గా యోగితారాణా నియమించింది. అలాగే సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా కొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఆదిలాబాద్ కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్, పెద్దపల్లి ఇన్చార్జ్ కలెక్టర్‌గా భారతీ హోలీకేరి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిగా ఇ.శ్రీధర్, కార్మిక, ఉపాధి కల్పనశాఖ కార్యదర్శిగా రాణి కుముదినిదేవి పర్యావరణ శాస్త్రసాంకేతిక అదనపు బాధ్యతలను రజత్‌కుమార్‌కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు వెలువరించారు.
- July 15, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- IAS OFFICERS
- TELANAGNA
- TRANSFERS
- ఐఏఎస్ ఆఫీసర్లు
- తెలంగాణ
- Comments Off on తెలంగాణలో 15 మంది ఐఏఎస్‌ల బదిలీ