హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం ఏసీబీ అదుపులో ఉన్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ భూ వివాదంలో నాగరాజు రూ. కోటి పదిలక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అయితే నాగరాజు ప్రస్తుతం చెంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైలు గదిలో ఆయన ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు జైలు అధికారులు తెలిపారు.
- October 14, 2020
- Top News
- ACB
- CENTRAL JAIL
- HYDERABAD
- SUCIDE
- TELANGANA
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య