సారథి న్యూస్, అచ్చంపేట: భారీవర్షాలకు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట సమీపంలోని డిండి వాగు ఉధృతిలో చిక్కుకుపోయిన భార్యాభార్తలు సురక్షితంగా బయటపడ్డారు. అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన సభావత్ వెంకట్రాములు, విజయ దంపతులు వ్యవసాయ పొలం పనులకు వెళ్లారు. వాగు ఉధృతి పెరగడంతో బుధవారం సాయంత్రం నీటిలో కొట్టుకుపోయి.. చెట్లను పట్టుకుని ఒడ్డుకు చేరారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్గువ్వల బాలరాజు సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్‌కుమార్‌తో మాట్లాడి హెలిక్యాప్టర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలని కోరారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ఎల్.శర్మన్, ఎస్పీ సాయిశేఖర్ దగ్గరుండి ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించి 1.30 గంటల ప్రాంతంలో సభావత్ వెంకట్రాములు, విజయ దంపతులను క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు బాధిత దంపతులను ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే చొరవకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
- September 17, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- షార్ట్ న్యూస్
- ACHAMPET
- GUVVALA BALRAJU
- SIDDAPUR
- అచ్చంపేట
- డిండి
- నాగర్‌కర్నూల్
- సిద్ధాపూర్
- Comments Off on డిండి వాగులో చిక్కిన భార్యాభర్తలు సేఫ్