సారథి న్యూస్, అనంతపురం : జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జేపీ ప్రభాకర్‌రెడ్డి బుధవారం బెయిల్‌పై విడుదలయ్యారు. బీఎస్3 వాహనాలను బీఎస్4 మార్చి రిజిస్టర్ చేయించారనే ఆరోపణలతో జేసీని, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ ప్రస్తుతం కడప జిల్లా జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు. బెయిల్ రావడంతో వీరిద్దరూ జైలు నుంచి విడుదలయ్యారు. జేసీ ట్రావెల్స్ మాజీ ఉద్యోగులు నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిపై తాడిపత్రి పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బీఎస్-3 వాహనాలను బీఎస్ – 4 వాహనాలుగా మార్చి తమకు అమ్మారని లారీ డ్రైవర్లు ఆరోపించారు. తమకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
- August 6, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- BAIL
- JAIL
- JC
- KADAPA
- PRABHAKARREDDY
- టీడీపీ
- బెయిల్
- Comments Off on జేసీ ప్రభాకర్‌రెడ్డికి బెయిల్