సారథిన్యూస్, గద్వాల: జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తున్నది. మహారాష్ట్రలో కొంతకాలంగా వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో గేట్లు ఎత్తివేశారు. జూరాలకు లక్ష 90 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. అధికారులు జూరాల ప్రాజెక్టులో25 గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 1,62,916 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జూరాలకు 1,90, 844 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9. 657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.933 టీఎంసీల నీరు నిలువ ఉన్నది. శ్రీశైలం ప్రాజెక్టుకు 1,62,916 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండటంతో దీంతో దిగువకు 38,140 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, 848 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంలు కాగా, 75.80 టీఎంసీల నీరు నిల్వ ఉంది.