Breaking News

జీహెచ్​ఎంసీలో డివిజన్​కో ఫిష్​స్టాల్​

జీహెచ్​ఎంసీలో డివిజన్​కో ఫిష్​స్టాల్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: రానున్న రోజుల్లో రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలు, దేశాలకు చేపలను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ఒక్కొక్కటి చొప్పున చేపల విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటుచేసిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ(ఎంపీఈడీఏ) ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​మత్స్యకారుల అభ్యున్నతికి సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నారని కొనియాడారు. 5.72 లక్షల హెక్టార్ల నీటివిస్తీర్ణంతో కర్ణాటక, తమిళనాడు తర్వాత తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో ఉందని చెప్పారు. 2019-20లో 3.10 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 8వ స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బొచ్చె, రాహు, మ్రిగాల, బంగారు తీగ, గడ్డి చేప వంటి ఐదు రకాలు మాత్రమే పెంచుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీఈడీఏ సంస్థ చైర్మన్ శ్రీనివాస్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, ఆగ్రోస్ ఎండీ రాములు, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్లు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, మురళీకృష్ణ పాల్గొన్నారు.