సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధి నుంచే 132 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 12, మేడ్చల్‌లో 3, యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు, సిద్దిపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇలా ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,650 కు చేరింది. ఆదివారం ఒకే రోజు 14 మంది చనిపోయారు. ప్రస్తుతం 1771 మంది వివిధ ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు.
- June 7, 2020
- తెలంగాణ
- CAROONA
- GHMC
- HYDERABAD
- కరోనా
- ట్రీట్మెంట్
- తెలంగాణ
- Comments Off on జీహెచ్ఎంసీలో కరోనా పంజా