సారథిన్యూస్, విశాఖపట్టణం: సీఎం జగన్మోహన్రెడ్డి అండతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దళితులపై వరుస దాడులు జరుగుతుంటే సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆదివారం విశాఖపట్టణం జిల్లా తెలుగుదేశంపార్టీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో దళితుడి భూఆక్రమణను ఖండించారు. రాష్ట్రంలో ప్రతిరోజు దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. జగన్ ఉదాసీన వైఖరితోనే దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఓ ఉన్మాది ముఖ్యమంత్రి ఉన్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
- August 30, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- APCM
- CHANDRABABU
- CM JAGANMOHANREDDY
- LOKESH
- ఏపీసీఎం
- చంద్రబాబు
- జగన్
- టీడీపీ
- లోకేశ్నాయుడు
- Comments Off on జగన్ అండతోనే దళితులపై దాడులు