న్యూఢిల్లీ: లద్దాఖ్ లేక్ వద్ద చైనాకు సమాధానం చెప్పేందుకు భారత్ దేశం హై పవర్ బోట్స్‌ను మోహరిస్తోంది. పెట్రోలింగ్‌కు చైనా వాడుతున్న చైనీస్ వెజల్స్‌కు చెక్ పేట్టేందుకు వీటిని దించుతున్నట్లు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్‌లోని పాంగోంగ్ సరస్సు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దురాక్రమణకు కేంద్రంగా ఉంది. భూభాగాన్ని విడిచిపెట్టాలని భారతీయులని బెదిరిస్తోంది. స్టీల్ హల్డ్ బోట్లును బోర్డర్‌లో మోహరించాలని గతవారం ట్రై సర్వీసెస్ మీటింగ్‌లో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీ–17 హెవీ బోట్లను లిఫ్ట్ ట్రాన్స్‌పోర్టర్స్ ద్వారా ప్రియారిటీ బేసిస్ మీద లెహ్‌కు పంపాలని కోరినట్లు తెలుస్తోంది.
ఓ వైపు చర్చలు జరుపుతున్న చైనా తన సైన్యాన్ని బోర్డర్‌లో మోహరిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో అక్కడ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు బరువును మోయగలిగే విమానాలు, హెలికాప్టర్ల ద్వారా భారీ సంఖ్యలో వాటిని అక్కడికి చేరుస్తున్నారు. ఇప్పటికే టీ–90 యుద్ధ ట్యాంకులను కూడా బోర్డర్‌లో ఉంచారు.