న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్య శైలి చాలా భిన్నంగా ఉంటుందని మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అన్నాడు. జట్టులోని ఆటగాళ్లను మునివేళ్లపై నిలబెడతాడని చెప్పాడు. ‘కోహ్లీ కెప్టెన్సీ శైలి చాలా ప్రత్యేకం. ప్రతిసారి జట్టును ముందుండి నడిపిస్తాడు. దూకుడుగా వ్యవహరించడం, అందరికి అండగా ఉండటం అతని శైలి. ధోనీ, రోహిత్ డ్రెస్సింగ్ రూమ్‌ను ప్రశాంతంగా ఉంచుతారు. ఆటగాడిలోని నైపుణ్యాన్ని వెలికితీయడంలో ధోనీ దిట్ట. ప్రతి ఒక్కరిపై పూర్తి అవగాహన ఉంటుంది. వ్యూహాలు రచించడంలో, అమలు చేయడంలో రోహిత్ కాస్త భిన్నంగా ఆలోచిస్తాడు’ అని పార్థివ్ వివరించాడు.
- June 29, 2020
- Archive
- Top News
- క్రీడలు
- CAPTAIN
- PARTHIV PATEL
- PLAYERS
- VIRAT KOHLI
- టీమిండియా
- సారథ్య శైలి
- Comments Off on కోహ్లీ సారథ్యం చాలా భిన్నం