సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మాదాసి, మాదారి కురువకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇస్తున్నారని, మరికొన్ని జిల్లాల్లో అధికారులు నిరాకరిస్తున్నారని, దీంతో ఆయా జిల్లాలో ఆ సామాజికవర్గం ఇబ్బంది పడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్పార్థసారధి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరుతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కురువలను ఎస్సీ జాబితాలో చేర్చుతానని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోయారని, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు నోరెత్తడంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా వారి సమస్యను పరిష్కరించాని డిమాండ్ చేశారు.
- July 7, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- BJP
- Kurnool
- కర్నూలు
- కురువలు
- బీజేపీ
- మాదాసి
- Comments Off on కురువల సమస్యలు పరిష్కరించండి