జైపూర్: రాజస్థాన్ రాజకీయాలు రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. సీఎం అశోక్ గెహ్లాట్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. సచిన్ పైలట్‌కు అనుకూలంగా ఉన్న 19 మంది ఎమ్మెల్యేలపై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం వేటు వేసింది. మరోవైపు అశోక్‌గెహ్లాట్‌కు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలను కాంగ్రెస్ జైపూర్‌లోని ఫెయిర్‌మౌంట్‌లో ఉంచింది. ఈ క్రమంలో ఆదివారం సరదాగా కొందరు ఎమ్మెల్యేలు అంత్యాక్షరి ఆడుతూ కనిపించారు. మరికొందరు తంబోలా ఆడుతూ, టీవీ చూస్తూ కాలక్షేమపం చేస్తున్నారు. మెజార్టీ వర్గం తమదేనని, తాము 100 కంటే ఎక్కువ మంది ప్రజాప్రతినిధులమని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర గుడా అన్నారు.
- July 19, 2020
- Archive
- జాతీయం
- BJP
- CONGRESS
- GAMES
- JAIPUR
- MLA
- అశోక్ గెహ్లాట్
- సచిన్ పైలట్
- Comments Off on కాంగ్రెస్ ఎమ్మెల్యేల అంత్యాక్షరి