తమ టీంలో ఎవరికీ కరోనా సోకలేదని రాంగోపాల్‌వర్మ స్పష్టం చేశాడు. ‘నా టీంలో ఒకరికి కరోనా సోకిందని దాంతో మేము షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశామని.. కొన్ని మీడియా సంస్థలు రాశాయి. ఇందులో ఏమాత్రం నిజం లేదు’ అని వర్మ ట్విట్టర్ వేదికగా వర్మ క్లారిటీ ఇచ్చాడు. కరోనా ఉదృతి ఓ రేంజ్ లో ఉన్నప్పటికీ వర్మ వరుస సినిమాలు చేస్తూ లాభాలు దండుకుంటున్నాడు. క్లైమాక్స్, నగ్నం చిత్రాలను తెరకెక్కించిన వర్మ తాజాగా 12 క్లాక్ అంటూ హారర్ సినిమాతో భయపెట్టబోతున్నాడు. అయితే అతని టీంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని దీంతో షూటింగ్‌కి తాత్కాలిక బ్రేక్ పడిందని వార్తలు వెలువడ్డాయి. దీంతో ట్విట్టర్ వేదికగా వర్మ స్పందించాడు. ‘వాస్తవానికి షూట్ ప్రారంభమయ్యే ముందు ప్రతి ఒక్కరం కరోనా పరీక్షలు చేయించుకున్నాం. అందరికి నెగెటివ్ అని తేలింది. అంతేకాదు ప్రభుత్వం సూచించిన అన్ని మార్గదర్శకాలను పాటిస్తున్నాం’ అని చెప్పాడు.
- July 5, 2020
- Archive
- సినిమా
- CARONA
- CLARITY
- MUMBAI
- RAMGOPALVARMA
- TEAM
- క్లారిటీ
- మీడియా
- Comments Off on ‘కరోనా’పై వర్మ క్లారిటీ