సారథిన్యూస్, రామడుగు: కరోనాను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్ విమర్శించారు. కరీంనగర్ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండా కరోనా వ్యాప్తికి కారణమవుతున్నదని ఆరోపించారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగలో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా వ్యాప్తికి బాధ్యత వహిస్తూ మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమాలాకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓ యువనేత పుట్టినరోజు వేడుకలంటూ వందలమంది కార్యకర్తలు ఒకే చోట గుమిగూడి కరోనాను వ్యాపింపజేశారని ఆరోపించారు.
- July 27, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- KARIMNAGAR
- MINISTERS
- RAMADUGU
- కరోనా
- కాంగ్రెస్ బీసీసెల్
- Comments Off on కరోనాపై ఇంత నిర్లక్ష్యమా