Breaking News

కరోనా పేషెంట్లలో ధైర్యం నింపాలి

కరోనా పేషెంట్లలో ధైర్యం నింపాలి

సారథి న్యూస్​, హైదరాబాద్​: హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని రెగ్యులర్ గా మానిటరింగ్​ చేయాలని, డాక్టర్లతో కౌన్సెలింగ్ ఇప్పించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ​ఆదేశించారు. సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంత్రి ఈటల రాజేందర్​, సీఎస్​ సోమేశ్​ కుమార్, జిల్లాల్లో కోవిడ్ మేనేజ్ మెంట్ పై జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులతో గురువారం బీఆర్ఆర్ భవన్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్థానిక జిల్లా మంత్రుల సలహాలు, సూచనలతో జిల్లాలో కరోనా వైరస్ నివారణ చర్యలను చేపట్టాలని కలెక్టర్లను కోరారు.

అనంతరం సీఎస్​ మాట్లాడుతూ జిల్లాల్లో టెస్టింగ్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి టెస్టింగ్ చేయడంతో పాటు వివరాలను అప్​లోడ్​ చేయాలన్నారు. పాజిటివ్ పేషెంట్లకు కౌన్సెలింగ్ తో పాటు మెడికల్ కిట్ ను అందించాలన్నారు. కోవిడ్ చికిత్సకు వైద్యులు, మెడికల్ సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించేందుకు ప్రతిపాదిస్తే తగిన అనుమతులు ఇస్తామన్నారు. కోవిడ్ చికిత్సకు పెండింగ్ బిల్లులు సమర్పించారు. సమావేశంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమశాఖ వాకాటి కరుణ, నీతూప్రసాద్, కమిషనర్ రఘునందన్ రావు, ఆర్థికశాఖ స్పెషల్ సెక్రటరీ రొనాల్డ్ రోస్ పాల్గొన్నారు.