న్యూఢిల్లీ: భారత్ లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. శనివారం (గత 24 గంటల్లో) కొత్తగా 77,266 పాజిటివ్ నమోదవడం వ్యాధి తీవ్రతకు అద్దంపడుతోంది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 33,87,501కు చేరింది. ఒక్కరోజే 70వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజాగా 1,057 మంది కోవిడ్ వ్యాధిబాధితులు మృతిచెందడంతో రోగుల సంఖ్య 61,529 కు చేరింది. ఇప్పటివరకు 25,83,948 మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 7,42,023 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు శనివారం కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ను విడుదల చేసింది.
- August 28, 2020
- Archive
- Top News
- జాతీయం
- CARONA
- COVID19 CASES
- INDIA
- POSITIVECASES
- ఇండియా
- కరోనా
- పాజిటివ్ కేసులు
- భారత్
- Comments Off on ఒకేరోజు 70వేలకు పైగా కేసులు