అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం(24 గంటల్లో) 10,526 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 4,00,721కు చేరింది. తాజాగా, వైరస్ బారినపడి 81మంది మృతిచెందారు. ఇప్పటివరకు 3,714 మంది మృత్యువాత పడ్డారు. 24 గంటల్లో 8,463 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,711కు చేరింది. తాజాగా 61,331 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తంగా 35,41,321 మెడికల్టెస్టులు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 96,191 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 833, చిత్తూరు 819, ఈస్ట్‌గోదావరి 1,178, గుంటూరు 801, కడప 501, కృష్ణా 414, కర్నూలు 757, నెల్లూరు 1,151, ప్రకాశం 874, శ్రీకాకుళం 764, విశాఖపట్నం 896, విజయనగరం 552, వెస్ట్‌గోదావరి 986 చొప్పున పాజిటివ్‌కేసులు నిర్ధారణ అయ్యయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌ను విడుదల చేశారు.